
పెనుబల్లి, వెలుగు : ఖమ్మం పెనుబల్లి మండలం సీతారామాపురం గ్రామం వద్ద ఉన్న ఎన్ఎస్పీ కాల్వలో బాతులు గుంపుగా ఈదుతూ ఆ కాల్వకే కళ తెచ్చాయి. వేసవి తాపంతో బాతులన్నీ ఒకేసారి కాల్వలోకి దిగి వరుసగా ఈదడం స్థానికులను ఆకట్టుకుంది.
ఈ దృశ్యాన్ని ఆదివారం ‘వెలుగు’ క్లిక్‌మనిపించింది.