‘‘కేటీఆర్.. నీకు మేమే ఎక్కువ.. డ్రామాలు ఆపేయ్’’ ప్రెస్ క్లబ్ చర్చ సవాల్పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

‘‘కేటీఆర్.. నీకు మేమే ఎక్కువ.. డ్రామాలు ఆపేయ్’’ ప్రెస్ క్లబ్ చర్చ సవాల్పై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్

హైదరాబాద్: ‘కేటీఆర్ ముందు నీ డ్రామాలు ఆపేసేయ్’ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఫైర్ అయ్యారు. కేటీఆర్కు అసెంబ్లీ అంటే గౌరవం లేదని, కేసీఆర్కు చట్టసభలంటే గౌరవం లేదని అద్దంకి దయాకర్ మండిపడ్డారు. కేటీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చించే దమ్ముంటే.. ‘మీ అయ్యను తీసుకోని రా.. లేదంటే దద్దమ్మ గా ఉండిపోతావు’ అని ఎద్దేవా చేశారు. అసలు కేటీఆర్ స్థాయి ఏంటని, అతనికే స్థాయి లేదని.. అలాంటి కేటీఆర్కు తామే ఎక్కువని అద్దంకి దయాకర్ విమర్శించారు.

ఇలాంటి చిల్లర చేష్టలు మానుకోవాలని, బీఆర్ఎస్ పాలనలో దోచుకున్న దానికి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితులో లేరని కేటీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘కేసీఆర్.. నీకు అసెంబ్లీకి వచ్చే దమ్ము లేదా.. కనీసం అదైనా ప్రకటించు కేసీఆర్.. అసెంబ్లీకి రానివాళ్లు అసెంబ్లీ దొంగలు మీరు’’ అని ఎమ్మెల్సీ అద్దంకి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేస్తున్న దానికి ఆ మురికి కాలువలో మునిగి చనిపోవాలని, కేటీఆర్ను ఏ డాక్టర్ కూడా బాగుచేయలేడని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ చెప్పుకొచ్చారు.

ఇక.. కేటీఆర్ ప్రెస్క్లబ్ చర్చ సవాల్పై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి మాట్లాడారు. అసెంబ్లీలో చర్చకు లేఖ ఇవ్వమంటే ఇవ్వకుండా ప్రెస్ క్లబ్ అంటూ కేటీఆర్ మాట్లాడుతున్నాడని ఆయన ఎద్దేవా చేశారు. మీ నాయకుడు కేసీఆర్ లెటర్ ఇస్తే అసెంబ్లీ పెట్టడానికి తాము సిద్ధంగా ఉన్నామని పరిగి ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తాము ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, ఇచ్చిన మాట ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏక కాలంలో 21వేల కోట్ల రైతు రుణమాఫీ చేశామని ఆయన గుర్తుచేశారు.

రైతు భరోసా 9 రోజులో 9 వేల కోట్లు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతు సంక్షేమ ప్రభుత్వం అని రామ్మోహన్ రెడ్డి చెప్పారు. నాలుక చీరేస్తా అని హరీష్ రావు ఎక్కువ మాట్లాడుతున్నడని, మీ నాయకుడితో ఈ రోజే లెటర్ ఇప్పించండని.. ఎప్పుడు అసెంబ్లీ పెట్టాలో కూడా మీరే చెప్పండని.. తాము సిద్ధంగా ఉన్నామని హరీష్ రావు, కేటీఆర్కు పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్ చేశారు.