గోదావరి జలాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రాణవాయువు.. కాళేశ్వరం దగ్గర నీళ్లు ఆపితే గ్రామాలు కొట్టుకుపోతాయి: సీఎం రేవంత్

గోదావరి జలాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రాణవాయువు.. కాళేశ్వరం దగ్గర నీళ్లు ఆపితే గ్రామాలు కొట్టుకుపోతాయి: సీఎం రేవంత్

గోదావరి జలాలకు ఎల్లంపల్లి ప్రాజెక్టే ప్రాణవాయువు అని అన్నారు సీఎం రేవంత్. కూలిన ప్రాజెక్టులకు, తట్టుకొని నిలబడిన ప్రాజెక్టుకు సజీవ సాక్ష్యం ఎల్లంపల్లి అన్నారు. గురువారం (ఆగస్టు 28) వరద బాధిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన సీఎం.. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. 

మంత్రి ఉత్తమ్ తో కలిసి కామారెడ్డి, మెదక్ ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు సీఎం రేవంత్. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో కలిసి గోదావరి తల్లికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సైంటిఫిక్ గా.. ఎన్ని వరదలు వచ్చినా నిలబడేలా కట్టిన ప్రాజెక్టు ఎల్లంపల్లి అని అన్నారు. 

►ALSO READ | గోదావరిఖనిలో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి..రామగుండంలో నీట మునిగిన లారీలు

కాళేశ్వరం దగ్గర నీళ్లు ఆపితే గ్రామాలకు గ్రామాలే కొట్టుకుపోతాయని తెలిపారు. కాళేశ్వరంలోని మూడు ప్రాజెక్టులె అతి తెలివితో కట్టారని.. అసెంబ్లీలో రిపోర్టుపై చర్చ తర్వాత అన్ని విషయాలు బయటపెడతామని చెప్పారు. మేడిగడ్డ విషయంలో నిపుణుల సూచలనల మేరకు వ్యవహరిస్తామని చెప్పారు సీఎం రేవంత్. ఎన్డీఎస్ఏ విచారణ పూర్తికాగానే చర్యలు ఉంటాయని తెలిపారు.