పెట్రోల్, గ్యాస్ కొరత..సీఎం రేవంత్ ఎమర్జెన్సీ రివ్యూ

పెట్రోల్, గ్యాస్ కొరత..సీఎం రేవంత్ ఎమర్జెన్సీ రివ్యూ

తెలంగాణలో పెట్రోల్, గ్యాస్ సిలిండర్లు, యూరియా నిల్వలపై ప్రభుత్వం ఆరాదీస్తోంది.  ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడం, వాహనదారులు బంకులకు క్యూ కట్టడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఈ  మేరకు  మార్చి 25న మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ  కమిటీ హాల్ లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించనున్నారు.  ఇంధన సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు.పెట్రోల్, గ్యాస్ కొరత తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు నిల్వలల నిర్వహణపై డిస్కస్ చేయనున్నారు. పెట్రోల్ దొరకదనే ప్రచారంతో బంకుల్లో పబ్లిక్ బారులు తీరడం, పెట్రోల్ బంకుల్లో పరిస్థితులపై ప్రభుత్వం ఆరాదీయనున్నారు.  కేంద్రంతో ఎప్పటికపుడు సంప్రదింపులు జరిపి కృత్రిమ కొరత లేకుండా  అధికారులను  ఆదేశించనున్నారు. 

హైదరాబాద్ సిటీ అంతా పెట్రోల్ పరేషాన్ నడుస్తోంది. ఎవరి నోట విన్నా పెట్రోల్, డీజిల్ మాటలే.. రోడ్డెక్కిన తర్వాత ఏ బంకు దగ్గర చూసినా క్యూలు. వందల సంఖ్యలో కార్లు, బైక్స్ పెట్రోల్, డీజిల్ కోసం క్యూలు. హైదరాబాద్ సిటీ పెట్రోల్ పరేషాన్ నడుస్తుంది. 

పెట్రోల్, డీజిల్ కొరత వస్తుందంట.. రెండు రోజులుపోతే అస్సలు దొరకదంట.. బంకులు మూసేస్తారంట అనే ప్రచారం విపరీతంగా జరిగింది. ఇదే సమయంలో రెండు, మూడు రోజులుగా వరసగా మూతబడుతున్న పెట్రోల్ బంకులతోపాటు.. చాలా బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తుండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. 

పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు.. కొన్ని బంకులు మూసేసి ఉండటంతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం బంకులకు పరుగులు తీస్తున్నారు.