సీఎం రేవంత్‌రెడ్డి కారాబాద్ జిల్లా కొడంగల్‌లో పర్యటిస్తున్నారు. మే 8న ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో కొడంగల్‌కు చేరుకున్న ఆయన రూ. 110 కోట్లతో చేపట్టే శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.
అదే విధంగా పట్టణంలో 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌల్తాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, కోస్గి వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత అక్కడ ఏర్పాటు చేసే బహిరగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఆఫీసర్లు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
