రైతుల సంక్షేమం కోసమే పోచారంను పార్టీలోకి తీసుకున్నాం : సీఎం రేవంత్

రైతుల సంక్షేమం కోసమే పోచారంను పార్టీలోకి తీసుకున్నాం : సీఎం రేవంత్

తెలంగాణ ప్రాంత రైతుల కోసం పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి తీసుకున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రైతుల  సంక్షేమం కోసం పోచారం కృషి చేశారని చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు రేవంత్ రెడ్డి. రైతుల బాగోగుల కోసం పోచారం సలహాలు తీసుకుంటామని తెలిపారు. రైతాంగాన్ని పటిష్టం చేయడానికి పోచారంను పార్టీలోకి తీసుకున్నామని చెప్పారు. 

 తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి సహకరించాలని కోరగానే పోచారం ఓకే చెప్పారని అన్నారు. వ్యవసాయం దండగ కాదు పండగ అనేల తమ ప్రభుత్వం చేయబోతుందని తెలిపారు. తమది రైతు రాజ్యం రైతు ప్రభత్వమని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.