ఈ నెలాఖరు వరకు మెట్రోను స్వాధీనం చేసుకుంటాం..75 కి. మీ విస్తరిస్తాం

ఈ నెలాఖరు వరకు మెట్రోను స్వాధీనం చేసుకుంటాం..75 కి. మీ విస్తరిస్తాం

 ఈ నెలాఖరు వరకు (మార్చి) మెట్రోను రూ.15వేల కోట్లతో స్వాధీనం చేసుకుంటామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. శాసన మండలిలో మాట్లాడిన ఆయన.. మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు . ఈ వ్యాపారంలో  ఉండడం లేదని మెట్రో నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుందన్నారు.  మెట్రోను స్వాధీనం చేసుకుని 75 కి.మీ వరకు విస్తరిస్తామన్నారు.  శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కనెక్టివిటీ ఉంటుందన్నారు.  పదేళ్ల నిర్లక్ష్యంతో మెట్రో దేశంలో 12 వ స్థానానికి పడిపోయిందన్నారు. దివంగత జైపాల్ రెడ్డి కృషితోనే మెట్రో రైలు వచ్చిందన్నారు రేవంత్ . 

33 వేల ఎకరాల్లో కొత్త సిటీని నిర్మించబోతున్నామని  చెప్పారు రేవంత్. అభివృద్దిని నగరానికే పరిమితం చేయడం లేదన్నారు. అభివృద్ధి విషయంలో రాజకీయం చేయొద్దన్నాని చెప్పారు రేవంత్. మాది గుడ్ గవర్నెన్స్ కాదు స్మార్ట్ గవర్నెన్స్ అని అన్నారు రేవంత్. 

►ALSO READ | హైదరాబాద్ సిటీ చుట్టూ 4 ఎలివేటెడ్ కారిడార్స్ : సీఎం రేవంత్ రెడ్డి

ఫుట్ పాత్ లపై ఆక్రమణలు తొలగిస్తాం

 రోడ్లను మూడు రకాలుగా విభజించామని తెలిపారు రేవంత్ .   రోడ్లు, అండర్ పాస్ లు, కారిడార్లు నిర్మించాలని ప్లాన్ వేశామని చెప్పారు.  సిటీలో సిగ్నల్ ఫ్రీ చేయాలనేదే  ఉద్దేశమన్నారు. సిటీలో ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులున్నా ఆక్రమణలు తొలగిస్తామన్నారు.   చిరు వ్యాపారులకు ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు.  జూన్, జులై వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు.  కేబీఆర్ దగ్గర మల్టీ లెవర్ పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు.