ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్పై త్వరలో హైపవర్ మీటింగ్ : బక్కి వెంకటయ్య

ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్పై త్వరలో హైపవర్ మీటింగ్ : బక్కి వెంకటయ్య
  •     ఏర్పాటుకు సీఎం రేవంత్​అంగీకారం: బక్కి వెంకటయ్య

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ డిపార్ట్‌‌‌‌మెంట్లలో నెలకొన్న వివిధ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు హైపవర్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి అంగీకారం తెలిపారని ఎస్సీ,-ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వెల్లడించారు. 

గురువారం మసాబ్‌‌‌‌ట్యాంక్‌‌‌‌లోని సంక్షేమ భవనంలో ఎస్సీ సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షా సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. “క్షేత్రస్థాయిలో పర్యటించినప్పుడు గుర్తించిన హాస్టళ్ల సమస్యలను సీఎంకు వివరించాం. ఆయన వెంటనే సానుకూలంగా స్పందించి హైపవర్ కమిటీ సమావేశానికి ఆమోదం తెలిపారు. 

ఈ సమావేశంలో సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నాం” అని వెంకటయ్య పేర్కొన్నారు.  ఎస్సీ, ఎస్టీలు చదువుతున్న పాఠశాలలు, కాలేజీల్లో విద్యార్థులందరినీ సమానంగా చూడాలని అధికారులను ఆదేశించారు. వివక్ష ప్రదర్శిస్తే వారి భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పారు. హాస్టళ్లలో మౌలిక వసతులు తక్షణం కల్పించడంతోపాటు నిధుల కొరత లేకుండా చొరవ తీసుకోవాలన్నారు.