Mitchell Starc: విలియంసన్, డివిలియర్స్ కాదు.. నేను ఆడిన వాళ్లలో అతడే నెంబర్.1 బ్యాటర్: మిచెల్ స్టార్క్

Mitchell Starc: విలియంసన్, డివిలియర్స్ కాదు.. నేను ఆడిన వాళ్లలో అతడే నెంబర్.1 బ్యాటర్: మిచెల్ స్టార్క్

ప్రస్తుత అంతర్జాతీయ క్రికెట్ లో బెస్ట్ బౌలర్ల లిస్ట్ లో స్టార్క్ ఖచ్చితంగా ఉంటాడు. ఫార్మాట్ ఏదైనా కొత్త బంతితో స్టార్క్ చాలా ప్రమాదకారి. తనదైన బౌలింగ్ తో ఆస్ట్రేలియా జట్టుకు ఎన్నో విజయాలను అందించాడు. స్టార్క్ బౌలింగ్ ఎదర్కోవడం అంటే ఎంతటి బ్యాటర్ కైనా సవాలే. ఇటీవలే టీ20 ఫార్మాట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్.. వన్డే, టెస్టులు మాత్రమే ఆడుతున్నాడు. ప్రస్తుతం యాషెస్ ఆడుతూ బిజీగా ఉన్న స్టార్క్ ఖాళీ సమయంలో ఒక ఇంటర్వ్యూలో తన అత్యుత్తమ బ్యాటర్ ఎవరో చెప్పాడు. ఎంతోమందికి తన బౌలింగ్ తో చెమటలు పట్టించిన స్టార్క్ కు నచ్చిన బ్యాటర్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
 
మిచెల్ స్టార్క్ కూకబుర్రా క్రికెట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న ఎదురైంది. "క్రికెట్ కెరీర్‌లో తాను ఎదుర్కొన్న అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ గురించి అడిగారు. ఈ విషయంపై స్టార్క్ మాట్లాడుతూ.. ఈ లిస్ట్ లో చాలామంది బ్యాటర్లు ఉన్నారని చెప్పాడు. ఒక పేరు మాత్రమే చెప్పాలని కోరడంతో విరాట్ కోహ్లీ పేరు చెప్పాడు. “నేను క్రికెట్ ఆడుతున్నప్పుడు చూసిన నంబర్ 1 బ్యాటర్ విరాట్ కోహ్లీ. అతను ఆటలో ఆధిపత్యం చూపిస్తాడు. RCB జట్టులో ఉన్నపుడు అతనితో అనుబంధం అద్భుతంగా ఉంది.” అని స్టార్క్ అన్నాడు. 

విరాట్ కోహ్లీ vs మిచెల్ స్టార్క్:

అంతర్జాతీయ క్రికెట్ లో స్టార్క్‌పై విరాట్ కోహ్లీకి మంచి రికార్డ్ ఉంది. ముఖ్యంగా టెస్టుల్లో స్టార్క్ పై 46.30 యావరేజ్ తో కోహ్లీ పరుగులు సాధించాడు. ఓవరాల్ గా స్టార్క్ బౌలింగ్ లో 477 బంతులను ఆడిన విరాట్.. 278 పరుగులు చేశాడు. స్టార్క్ బౌలింగ్ లో కోహ్లీ ఆరు  సార్లు ఔటయ్యాడు. వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో రెండుసార్లు మాత్రమే మిచెల్ స్టార్క్ బౌలింగ్ లో ఔటయ్యాడు. టీ20 ఫార్మాట్ కు వస్తే ఒక్కసారి కూడా కోహ్లీని స్టార్క్ ఔట్ చేయలేకపోయాడు. 

టెస్టులు: 278 పరుగులు, 6 సార్లు ఔట్, 46.3 యావరేజ్ 

వన్డేలు: 162 పరుగులు, 2 సార్లు ఔట్, 81 యావరేజ్ 

టీ20లు: 15 పరుగులు, 0 ఔట్