రేపే బ్లాక్ ఫ్రైడే: ఎలక్ట్రానిక్స్ పై 85% వరకు భారీ డిస్కౌంట్స్, అదిరిపోయే ఆఫర్స్ ! అస్సలు మిస్సవకండి..

 రేపే బ్లాక్ ఫ్రైడే: ఎలక్ట్రానిక్స్ పై 85% వరకు భారీ డిస్కౌంట్స్, అదిరిపోయే ఆఫర్స్ !  అస్సలు మిస్సవకండి..

ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రజలు బ్లాకర్ ఫ్రైడే కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే రోజున చాల పెద్ద  బ్రాండ్లపై ఆన్‌లైన్ స్టోర్స్ ఊహించని భారీ డిస్కౌంట్లను అందిస్తుంటాయి. ప్రతి సంవత్సరం నవంబర్ నాల్గవ గురువారం థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు. ఈసారి థాంక్స్ గివింగ్ నవంబర్ 27న వస్తుంది కాబట్టి బ్లాక్ ఫ్రైడే రేపు నవంబర్ 28న జరుపుకుంటారు.  

అమెజాన్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ 2025 ఇప్పటికే ప్రారంభమైంది. స్మార్ట్‌ఫోన్‌లపై 40 శాతం వరకు డిస్కౌంట్, యాక్సిస్, HDFC, BOBCard,  RBL బ్యాంక్ కార్డులతో పేమెంట్స్ చేస్తే 10 శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్...   అలాగే Apple, Samsung, Realme, Vivo, Xiaomi,  OnePlus వంటి టాప్ బ్రాండ్‌ల నుండి అతితక్కువ ధరకే స్మార్ట్ ఫోన్స్ కొనేందుకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. ప్రతినెల  EMI అప్షన్ కూడా ఉంది. 

మీరు కొత్త ఐఫోన్ కొనాలని చూస్తున్నారా.... అయితే క్రోమా బ్లాక్ ఫ్రైడే సేల్ లో ఐఫోన్ 16, ఐఫోన్ 17, అల్ట్రా-స్లిమ్ ఐఫోన్ ఎయిర్‌పై భారీ డిస్కౌంట్స్  ఉన్నాయి.  

ALSO READ : నెట్ ఫ్లిక్స్ సర్వర్లు క్రాష్.. స్ట్రేంజర్ థింగ్స్ 5 రిలీజ్ ఎఫెక్ట్..

ఐఫోన్ 16: దీని 128GB మోడల్ ని కేవలం రూ.39,990 కంటే తక్కువ ధరకు కొనొచ్చు. దీని అసలు ధర రూ.79,900. బ్యాంక్ ఆఫర్‌లు, క్యాష్‌బ్యాక్ ఇంకా ఎక్స్ఛేంజ్ బోనస్‌ కలిపి ఈ ధర ఇంకా తగ్గొచ్చు. 

ఐఫోన్ 17: లేటెస్ట్ ఐఫోన్‌ కొనాలనుకునేవారికి 256GB మోడల్ రూ.45,900 తక్కువ ధరకు లభిస్తుంది. దీని అసలు ధర రూ.82,900.   
 
ఐఫోన్ ఎయిర్: ప్రీమియం, అల్ట్రా-స్లిమ్ డిజైన్ కావాలనుకునే వారికి, ఐఫోన్ ఎయిర్ రూ.54,900ని సొంతం చేసుకోవచ్చు. ఇది లాంచ్ ధరతో పోలిస్తే దాదాపు సగం ధర. 

అమెజాన్: నవంబర్ 28న ప్రారంభమయ్యే ఈ సేల్ ఫ్యాషన్, బ్యూటీ ఉత్పత్తులపై 60% వరకు డిస్కౌంట్ అందిస్తుంది.

ఫ్లిప్‌కార్ట్: ఈ సేల్ నవంబర్ 28 వరకు కొనసాగుతుంది. ఫ్యాషన్, బ్యూటీ అలాగే గృహోపకరణాలపై 50–70% వరకు ఆఫర్లు  ఉన్నాయి.

అజియో: నవంబర్ 28న ప్రారంభమయ్యే ఈ సేల్‌లో కనీసం 50% డిస్కౌంట్ హామీ ఇస్తుంది.

మైంత్రా: మైంత్రాలో నవంబర్ 27 నుండి ప్రారంభమయ్యే ఈ సేల్‌లో కనీసం 40% డిస్కౌంట్ లభిస్తుంది.

టాటా క్లిక్: నవంబర్ 25 నుండి 30 వరకు జరిగే ఈ సేల్‌లో హోమ్ అప్లియన్సెస్, ఫ్యాషన్ & బ్యూటీ ఉత్పత్తులపై 85% వరకు డిస్కౌంట్  ఇస్తుంది.