హైదరాబాద్: గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల సందడి మొదలు కాగా.. ఏకగ్రీవానికి ఆఫర్స్ వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఎలక్షన్ షెడ్యూల్ విడుదలై మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల పర్వం స్టార్ట్ అవ్వడంతో సర్పంచ్ పదవులపై కన్నేసిన ఆశావాహులు రంగంలోకి దిగారు. పోటీ వద్దంటూ ఏకగ్రీవాల కోసం బేరసారాలు మొదలుపెట్టారు. గ్రామంలో గుడి, బడిలాంటి అభివృద్ధి పనులకు పెద్దమొత్తంలో డబ్బులిస్తామని ఆఫర్ చేస్తున్నారు. మరోవైపు ఏకగ్రీవ పంచాయతీలకు తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లోంచి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఇస్తామని ప్రజాప్రతినిధులు కూడా ప్రకటిస్తున్నారు.
దీంతో గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవాలు ఊపందుకున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాకముందే రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం రూప్లా నాయక్ తండాలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. సర్పంచ్‌గా జవహర్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ ఆ గ్రామస్తులంతా తీర్మానం చేశారు. తాజాగా అదే రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో మూడు గ్రామ పంచాతీయల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. వీటితో పాటు నిర్మల్ జిల్లాలో వాస్తాపూర్, ఆదిలాబాద్ జిల్లా వాల్గోండ గ్రామ సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు ఆయా ఆ గ్రామస్తులంతా తీర్మానం చేశారు.
సిరిసిల్ల జిల్లాలో మూడు గ్రామాల్లో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం
- రుద్రంగి మండలం వీరుని తండా సర్పంచ్‌గా గూగులోతు మంజుల ఏకగ్రీవం
- రుద్రంగి మండలం గైది గుట్ట తండా సర్పంచ్‌గా ఇస్లావత్ కిషన్ ఏకగ్రీవం
- రుద్రంగి మండలం చింతమణి తండా గ్రామ సర్పంచ్‌గా గూగులోతు సింధుజ ఏకగ్రీవం
ఆదిలాబాద్ జిల్లా వాల్గోండ గ్రామ సర్పంచ్‌గా సునీత జుగదీరావు ఏకగ్రీవం
సిరికోండ మండలం రాయిగూడ గ్రామ సర్పంచ్‌గా లక్ష్మణ్ రావు ఏకగ్రీవం
మామడ మండలం వాస్తాపూర్ గ్రామ సర్పంచ్‌గా ఆడెపు భుంభాయ్ ఏకగ్రీవం
