చేతనైతే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి.. అంతు చూస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

చేతనైతే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి.. అంతు చూస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సచివాలయం ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెడితే బీఆర్ఎస్ నేతలు తొలగిస్తామని అంటున్నారని, అధికారం పోయినా వారికి అహంకారం తగ్గలేదని మండిపడ్డారు.చేతనైతే రాజీవ్ విగ్రహాన్ని టచ్ చేయండి.. అంతు చూస్తామని హెచ్చరించారు. ఉద్యమం ముసుగులో కేసీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. అధికారం పోయినా విచక్షణ లేకుండా మాట్లాడితే తెలంగాణ నుండి సామజిక బహిష్కరణ ఉంటుందని అన్నారు సీఎం రేవంత్.

రాజీవ్ దేశ సమగ్రత కోసం ప్రాణాలర్పించారని అన్నారు. రాజీవ్ గాంధీ దేశంలో కంప్యూటర్ యుగాన్ని సృష్టించారని అన్నారు. యువతకు రాజీవ్ గాంధీ స్ఫూర్తిదాయకమని అన్నారు. సోనియా పట్టుదల వల్లే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని, దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబాన్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.