
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం వార్తలపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఖాయమని, కేసీఆర్‌కు గవర్నర్ పదవి, కేటీఆర్‌కు కేంద్రమంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని అన్నారు. హరీష్‌రావు అసెంబ్లీలో అపోజిషన్ లీడర్ అవుతారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.
ప్రస్తుతం బీఆర్ఎస్ కు ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల విలీనంతో కవితకు రాజ్యసభ పదవి దక్కుతుందని, కవితకు బెయిల్ కూడా వస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.