సంగీతాభిమానులకు తీరని లోటు..గాయని జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

సంగీతాభిమానులకు తీరని లోటు..గాయని జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్, వెలుగు: ప్రముఖ గాయని ఎస్.జానకి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దక్షిణ భారత సినీ సంగీత ప్రపంచంలో జానకి తన గళమాధుర్యంతో సంగీతాభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని కొనియాడారు. అనేక చిత్రాల్లో పాత్ర సన్నివేశాలు, సందర్భాలకు అనుగుణంగా నవరసాలను పలికిస్తూ ఆమె పాడిన పాటలు శ్రోతలను మంత్రముగ్ధులను చేశాయని వివరించారు.

అలాంటి గొప్ప గాయని మన తెలుగు వారు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. జానకమ్మ మరణం భారతీయ చలనచిత్ర పరిశ్రమకే కాకుండా కోట్లాది సంగీతాభిమానులకు తీరని లోటు అని సీఎం పేర్కొన్నారు. భగవంతుడు ఆమె ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థిస్తూ, జానకి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

వియత్నాం బోటు ప్రమాదంపై దిగ్భ్రాంతి

వియత్నాం బోటు ప్రమాదంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు టూరిస్టులు మరణించారనే సమాచారంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే స్పందించి అధికా రులను అప్రమత్తం చేశారు. ప్రమాదానికి సం బంధించిన పూర్తి వివరాలను తక్షణమే తెలుసు కోవాలని ఆదేశించారు. సహాయక చర్యలను ముమ్మరం చేసేందుకు కేంద్ర విదేశాంగ మం త్రిత్వ శాఖతో మాట్లాడాలన్నారు.

అలాగే వియ త్నాంలోని భారతీయ ఎంబసీ కార్యాలయ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరపాల ని సీఎస్‌‌ను ఆదేశించారు. ఈ ప్రమాదంలో తెలుగువారు కూడా ఉన్నారని ప్రాథమిక సమా చారం అందిన నేపథ్యంలో బాధితుల పూర్తి 

వివరాలను సేకరించాలని చెప్పారు. ఘటనలో గాయపడినవారికి అక్కడికక్కడే అవసరమైన మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రమాదానికి గురైన బాధితులకు, వారి కుటుంబాలకు ప్రభుత్వం   అండగా ఉంటుందని సీఎం భరోసా ఇచ్చారు.