జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన అక్కాచెల్లెళ్లను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన అక్కాచెల్లెళ్లను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఎయిర్ గన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ ఆధ్వర్యంలో గోవాలో జరిగిన 10వ నేషనల్ రైఫిల్ అండ్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ 2024 పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించిన భూక్య మోనాలిసా, భూక్య సోనాలిసా ఈ రోజు సెక్రటేరియట్ లో మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్భంగా రైఫిల్ అండ్ పిస్టల్ విభాగంలో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చిన వీరిని సీఎం అభినందించారు. పట్టుదలతో ముందుకు సాగి అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ సత్తాను చాటాలని సీఎం వారిని ప్రోత్సహించారు. తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయసహకారాలను అందిస్తుందని వారికి భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం యువత క్రీడాకారులుగా ఎదిగే దిశగా ప్రభావవంతమైన కార్యాచరణ ప్రణాళికను రూపొందించే దిశగా కృషి చేస్తున్నదని సీఎం తెలిపారు.