తీన్మార్​ మల్లన్నకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు

తీన్మార్​ మల్లన్నకు సీఎం రేవంత్  శుభాకాంక్షలు

హైదరాబాద్, వెలుగు: నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి శాసన మండలికి ఎన్నికైన కాంగ్రెస్​ నేత చింతపండు నవీన్ కుమార్ (తీన్మార్ మల్లన్న)కు సీఎం రేవంత్​ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు అభినందనలు తెలిపారు. 

రేవంత్‌‌ ను కలిసిన ఎంపీలు

 ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ఎంపీలు మర్యాదపూర్వకంగా కలిశారు. శనివారం తుగ్లక్ రోడ్‌‌లోని సీఎం క్యాంప్ ఆఫీసులో జరిగిన ఈ భేటీలో.. ఎంపీలు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, రఘురామ్ రెడ్డి, బలరాం నాయక్, మల్లు రవి, అనిల్ కుమార్ ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తదితర అంశాలపై వారు చర్చించారు. తొలిసారి పార్లమెంట్‌‌లో అడుగుపెడుతున్న ఎంపీలకు సీఎం పలు అంశాలపై దిశానిర్దేశం చేసినట్లు తెలిసింది.