
అసెంబ్లీలో మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. సభను కేటీఆర్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సలహాలు ఇస్తామంటూనే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్ల నేతన్నలతో బతుకమ్మ చీరలు ఎందుకు తయారు చేయించలేదని ప్రశ్నించారు.
సూరత్ లో చీరలు తెచ్చి బతుకమ్మ కానుకలు ఇచ్చారన్నారు. బతుకమ్మ చీరలను ఆడబిడ్డలు తిరస్కరించారని.. బతుకమ్మ చీరల్లోనూ కమీషన్లు కొట్టేశారని ఆరోపించారు.100 కోట్ల బతుకమ్మ బకాయిలను తాము చెల్లించామన్నారు. బీఆర్ఎస్ నేతల బినామీలకు బతుకమ్మ కాంట్రాక్టులు ఇచ్చారని తెలిపారు.
సీఎం రేవంత్ వ్యాఖ్యలు
- పదేళ్లలో చేయలేని మీరు పది నెలలైన మమ్మల్ని ప్రశ్నిస్తారా?
- ట్యాంక్ బండ్ లోని నీళ్లను కొబ్బరి బోండలా చేస్తామని మేం చెప్పలేదు
- ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్ ను ఎందుకు విస్తరించలేదు
- ఎయిర్ పోర్టు వరకు ఎంఎంటీఎస్ ను బీఆర్ఎస్ అడ్డుకుంది
- దీని వెనుక ఆర్థిక కుట్ర ఏంటో అందరికి తెలియాలి..
- మేమెప్పుడు పాతబస్తీని ఇస్తాంబుల్..కరీంనగర్ ను న్యూయార్క్ చేస్తామని మేం చెప్పలేదు
- టూరిజం హబ్ క్రియేట్ చేస్తామని చెబుతున్నాం
- పేదలకు తక్కువ ధరకు వైద్యం అందించేందుకు కృషి చేస్తాం
- మహమ్మద్ సిరాజ్, నిఖత్ జరీనాలకు గ్రూప్ 1 ఉద్యోగం ఇస్తాం
- స్పోర్ట్స్ గేమ్స్ లో యువతకు నైపుణ్యం కల్పిస్తాం
- అంతర్జాతీయ ప్రమాణాలతో స్టేడియాన్ని నిర్మిస్తాం
- ఏషియన్ గేమ్స్ నిర్వహించిన సిటీలో స్టేడియాలు తాగుబోతులకు అడ్డాగా మారాయి
- ఫార్మాసిటీ అని వాళ్లుంటున్నారు..ఫార్మా విలేజ్ లు అని మేం అంటున్నాం
- ముచ్చెర్ల దగ్గకర భూ సేకరణకు కేటీఆర్ రెచ్చగొడుతున్నారు
- ముచ్చెర్లలో నాల్గో ఫ్యూచరర్ సిటీ నిర్మిస్తాం
- మెట్రో సౌకర్యం కల్పిస్తాం
- ఏఐ హబ్ క్రియేట్ చేస్తాం
- బీఆర్ఎస్ పదేళ్లలో మోసం చేసింది
- కేటీఆర్ ఫుల్లీ ఆర్టిఫిషియల్, ఇంటీజెంట్లీ నిల్
- ప్రపంచస్థాయి వైద్యం హైదరాబాద్ నగరంలో అందుబాటులోకి వచ్చేలా ప్రయత్నం చేస్తున్నాం
- వ్యవసాయం, స్పోర్ట్స్ పాలసీలు తీసుకొస్తాం
- ధరణీ మీద పాలసీలు తెస్తాం..మీ సలహాలు ఇవ్వండి
- పబ్లిక్ కు ఉపయోగపడే పాలసీలు తీసుకొస్తాం
- స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నాం..
కేటీఆర్ వ్యాఖ్యలు
- 5 ఏళ్లు బిల్లులు పెండింగ్ పెట్టినం నిజమే
- బతుకమ్మ చీరలు మొదటి ఏడాది సూరత్ లో కొన్నం
- పదేండ్ల పాలనలో ఏ తప్పులు జరిగినా చర్యలు తీసుకోండి
- పాలసీలు కాదు కేసీఆర్ అంటే జెలసీ మాత్రమే కనిపిస్తోంది
- నేను విదేశాల్లో చదివా
- రేవంత్ అదృష్టం కొద్దీ సీఎం అయ్యారు
- రేవంత్ నాకు మంచి మిత్రుడే ..పదేళ్ల క్రితమే మా మధ్య చెడింది
- నేను అన్ని అన్ని గవర్నమెంట్ స్కూళ్లలోనే చదివా