
గత పదేళ్లలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై చర్చను ప్రారంభించిన కేటీఆర్.. తెలంగాణను అప్పుల పాలు చేశారని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన రిపోర్టు్ల్లోనే విరుద్ధ ప్రకటనలు ఉన్నాయని చెప్పారు.
దేశంలో ఎన్నో రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ మెరుగైన స్థితిలో ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ చీకట్లో నిండిపోతుందని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లు చెప్పారు. . తెలంగాణ వారికి పాలించే సత్తా లేదని ఉమ్మడి రాష్ట్రంలో చాలా మంది ఎద్దేవా చేశారన్నారు. పదేళ్లలో రాష్ట్ర ఆదాయం భారీగా పెరిగిందని విపక్షంలో ఆనాడు భట్టి విక్రమార్క చెప్పారు..అధికారంలోకి వచ్చాక మాట మార్చారని విమర్శించారు కేటీఆర్.
తెలంగాణ వచ్చినప్పుడు 2014లో రెవెన్యూ 26 వేల కోట్లు ఉంటే.. 2024లో లక్షా 60 వేల కోట్లుగా ఉందన్నారు కేటీఆర్. తమ హయాంలో తెలంగాణ పరపతి పెరిగిందన్నారు. దేశ సగటు కన్నా తెలంగాణలోని 33 జిల్లాలో తలసరా ఆదాయం ఎక్కువగా ఉందన్నారు. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందంటే ఎవరూ పెట్టుబడుటు పెట్టబోరన్నారు. కాంగ్రెస్ నేతలు పెరిగిన సంపదను దాచిపెట్టి అప్పులు గురించి మాత్రమే మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు.
బట్జెట్ లో ఆరు గ్యారంటీలకు టాటా చెప్పారన్నారు కేటీఆర్. బీఆర్ఎస్ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన గురించి మీరు మాట్లాడుతున్నప్పుడుగత కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తామెందుకు మాట్లాడకూడదన్నారు. సీఎం సీటులోకి భట్టి వెళ్లాలని కోరారు. మంచి నిర్ణయాలకు బీఆర్ఎస్ ఎప్పుడూ మద్దతు ఇస్తుందన్నారు. ఓట్ల ముందేమో అభయహస్తం..ఓట్ల తర్వాత శూన్య హస్తం అంటూ ఎద్దేవా చేశారు కేటీఆర్.