హైదరాబాద్, వెలుగు : గాంధీ భవన్లో పలు ప్రజా సంఘాల నేతలు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ ఉన్నఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. తెలంగాణ పౌర హక్కుల పరిరక్షణ సమితి, తెలంగాణ ఎమ్మార్పీఎస్
ఇతర ప్రజా సంఘాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఆరు నెలల్లోనే ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తున్నదని తెలిపారు.
