హైదరాబాద్ ను చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అభివృద్ధి చేశారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ ను చంద్రబాబు, వైఎస్ఆర్, కేసీఆర్ అభివృద్ధి చేశారు: రేవంత్ రెడ్డి

హైదరాబాద్ లోని నానక్ రామ్ గూడలో సీఎం రేవంత్ రెడ్డి నేడు ఫైర్ సేఫ్టీ డిపార్ట్ మెంట్ లో  కమాండ్ కంట్రోల్ రూం ప్రారంభించారు. ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వర్టర్స్ ప్రారంభించడం సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫైర్ డిపార్ట్ మెంట్ అనేది కేవలం అగ్ని ప్రమాదాలు కోసమే కాదని విపత్తకర పరిస్థితుల్లో కూడా వీరు సేవలు అందిస్తారని అన్నారు. ప్రాణాలు తెగించి అందరి ప్రాణాలు కాపాడడం లో ఫైర్ డిపార్ట్ మెంట్ కీలకమని చెప్పుకొచ్చారు. ఎన్నో వేలాది నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే ఫైర్ డిపార్ట్ మెంట్ కి భవనం కచ్చితంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.


గత ముప్పై ఏళ్లుగా హైదరాబాద్ నగరాన్ని చంద్రబాబు, వైఎస్ ఆర్, కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని, రాజకీయాలకు అతీతంగా వారు తీసుకున్న నిర్ణయాలు, అనుభవాలను మా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తుందని అన్నారు. హైదరాబాద్ కు ముందుగా ఔటర్ రింగ్ రోడ్డు ను చంద్రబాబు ప్రతిపాదిస్తే దాన్ని వైఎస్ ఆర్ పూర్తి చేశారని తెలిపారు. హైదరాబాద్ కు త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొచ్చి, దాని వెంట ట్రైన్ సదుపాయం కూడా ప్లాన్ చేస్తున్నామన్నారు. 

ALSO READ : ఈ చిన్న గ్రామంలో ప్రతి ఇంటికో IAS లేదా IPS ఆఫీసర్


 హైదరాబాద్ తో  రాష్ట్ర మొత్తం అభివృద్ధి చెందేలా 2050 మెగా మాస్టర్ ప్లాన్ దిశగా ముందుకు వెళ్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ పక్కన డ్రగ్ తయారీ కంపనీ ఏర్పాటు మంచి నిర్ణయం కాదని వాటిని గ్రామాలో నిర్మించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.10  నుండి 15 గ్రామాల్లో ఫార్మా ఫార్మ్ ను ప్లాన్ చేస్తున్నాం 
ఒకే చోట 25 వేల ఎకరాల్లో ఫార్మ తీసుకొస్తే నగరం అంత కలుషితం అవుతుందనే  అపోహాలకు ఎవరూ లోను కావద్దని ప్రజలను ముఖ్యమంత్రి కోరారు. రాజకీయంగా ఆయనకు అనుభవం ఉందని, నిర్మాణ రంగంలో నిపుణులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. అంతే కాని గత ప్రభుతంలా అపర మేధావులమని తొందర పాటు పనులు చేస్తే అది మేడిగడ్డ అవుతుందని అన్నారు. అవగాహన లేకుండా అనుమతులు ఇస్తూ  సంతకాలు పెడితే మాజీ HMDA డైరెక్టర్ బాలకృష్ణ పరిస్థితి వస్తాదని రేవంత్ రెడ్డి అధికారులను హెచ్చరించారు.