హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

హైడ్రా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి

చెరువులు, కుంటలు, పార్కులు తదితర ప్రభుత్వ భూములను కాపాడే లక్ష్యంతో ఏర్పడిన హైడ్రా మొట్టమొదటి పోలీస్ స్టేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.  హైదరాబాద్ లో బుద్ధ భవన్ పక్కనే నిర్మించిన హైడ్రా భవన్ ను గురువారం (మే 8) ప్రారంభించారు సీఎం. హైడ్రా కమిషనర్ రంగనాథ్, ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, మేయర్ విజయలక్ష్మి, ఇతర అధికారులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరైన సీఎం హైడ్రా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ తర్వాత హైడ్రా కు కొత్తగా కేటాయించిన డీసీఎం, స్కార్పియో కార్లు, బైక్స్ ను ప్రారంభించారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ను పరిశీలించారు. హైడ్రా స్టేషన్ లోని వివిధ విభాగాలను  సీఎం కు వివరించారు కమిషనర్ రంగనాథ్.

►ALSO READ | ఇండియాలో బటన్ నొక్కుడు.. పాకిస్తాన్ లో పేలుడు : హార్పీ డ్రోన్స్ తో చెలరేగిపోతున్న ఇండియన్ ఆర్మీ