ముషీరాబాద్, వెలుగు: ప్రపంచ స్థాయి షాపింగ్, డైనింగ్, వినోదాల సమ్మేళనంగా ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏర్పాటు చేసిన అల్ట్రా ప్రీమియం ఓడియన్ మాల్‌ను సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఐనాక్స్ పేరిట ఏర్పాటైన ఈ మాల్ ప్రారంభోత్సవంలో సీఎంతోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఓడియన్ మాల్ డైరెక్టర్ తుల్లా విజయేందర్ గౌడ్, అమర్నాథ్ పాల్గొన్నారు. కాగా, గురువారం అశోక్‌నగర్‌లో నిరుద్యోగుల ఆందోళన చేయగా, మళ్లీ నిరసనకు దిగుతారన్న సమాచారంతో పోలీసుల అలర్ట్ అయ్యారు. సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
