సామాన్య జనాలకు అందుబాటులో ఉంటున్న సీఎం రేవంత్​ రెడ్డి

సామాన్య జనాలకు అందుబాటులో ఉంటున్న సీఎం రేవంత్​ రెడ్డి

 హైదరాబాద్, వెలుగు: తాను సకల జన హితుడినని.. సామాన్య మనిషినని సీఎం రేవంత్​ రెడ్డి అన్నారు. శనివారం ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘‘నేను.. చేరలేని దూరం కాదు.. దొరకనంత దుర్గం కాదు,  సామాన్య మనిషిని నేను.. సకల జన హితుడను నేను’’ అని పేర్కొన్నారు. గత బీఆర్​ఎస్​ ప్రభుత్వంలోని  సీఎం మాదిరిగా కాకుండా.. తాను సామాన్య జనానికి అందుబాటులో ఉన్నట్టు పరోక్షంగా చెప్పారు.

 శనివారం సాయంత్రం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులను ఆయన నేరుగా కలుసుకున్నారు. జూబ్లీహిల్స్​లోని ఆయన నివాసానికి వచ్చిన వారి బాధలను వినడంతో పాటు సంబంధిత శాఖలకు సూచనలు చేశారు. కొన్ని సమస్యలను ఎన్నికల కోడ్‌ ముగియగానే పరిష్కరిస్తామన్నారు. రెవెన్యూ ఉద్యోగి దయాకర్‌ తనకు 317 జీవో కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేయగా.. కోడ్​ ముగియగానే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.