రాజముద్రపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

రాజముద్రపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

తెలంగాణ రాజముద్రపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా రాష్ట్ర చిహ్నం, గీతాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో మే 30వ తేదీ గురువారం సాయంత్రం రాష్ట్ర గీతం, చిహ్నంపై చర్చించేందుకు సచివాలయంలో పలు రాజకీయ పార్టీల నేతలతో  సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నేతలు చేసిన పలు సూచనలను పరిగణలోకి తసీుకున్న సీఎం రేవంత్ రెడ్డి  రాజముద్ర విడుదలను వాయిదా వేసినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర రాజముద్రపై శిల్పి రుద్రరాజేశం పలు డిజైన్లు తయారు చేశారు. రాజముద్రపై దాదాపు 500 నమూనాలు ప్రభుత్వానికి వచ్చినట్లు సీఎం చెప్పారు. దీంతో మరిన్ని సంప్రదింపుల ద్వారానే రాష్ట్ర రాజముద్ర, తెలంగాణ తల్లి విగ్రాహవిష్కరణపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖుల అభిప్రాయాలతో పరిగణలోకి తీసుకుని రాజముద్రను ఫైనల్ చేస్తామని చెప్పారు. అందరి అభిప్రాయం తీసుకున్న తర్వాతనే రాజముద్రను విడుదల చేయాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.