- శృంగేరి శారదా పీఠం జగద్గురువుతో భేటీ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నల్లకుంటలోని శంకరమఠంలో గణపతి, శారదాంబ, చంద్రమౌళీశ్వర స్వామి, ఆదిశంకరాచార్యుల ఆలయాలను సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శంకరమఠంలో శృంగేరి శారదా పీఠం జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీతీర్థ మహాస్వామి వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. “ధర్మ విజయ యాత్ర”లో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన విధుశేఖర భారతీస్వామికి ఈ సందర్భంగా సీఎం.. వేములవాడ ఆలయ అభివృద్ధి వివరాలను తెలియజేశారు. సీఎం వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఉన్నారు.
