పోలీసు కేసును కొట్టివేయండి..హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌‌‌‌ రెడ్డి

పోలీసు కేసును కొట్టివేయండి..హైకోర్టును ఆశ్రయించిన రేవంత్‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీలో అనుమతి లేకుండా 2016లో నిర్వహించిన సభలో పాల్గొన్నారన్న అభియోగంపై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి హైకోర్టులో పిటిషన్‌‌‌‌ వేశారు. దీనిని గురువారం జస్టిస్‌‌‌‌ కె. లక్ష్మణ్‌‌‌‌ విచారించారు. పిటిషనర్‌‌‌‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. 2016 జూన్‌‌‌‌లో ఉస్మానియా యూనివర్సిటీలో నిర్వహించిన తెలంగాణ జనజాతర బహిరంగ సభలో అప్పుడు ఎంపీగా ఉన్న రేవంత్‌‌‌‌  పాల్గొనడంపై పోలీసులు కేసు నమోదు చేశారని తెలిపారు.

పోలీసుల అనుమతి లేదన్న కారణంగా కేసు నమోదైందని చెప్పారు. రాజకీయ కక్షతో నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి కింది కోర్టులో హాజరు నుంచి రేవంత్‌‌‌‌ రెడ్డికి మినహాయింపునిచ్చారు. అయితే కోర్టు తప్పనరి అని ఆదేశాలు జారీ చేస్తే హాజరుకావాలన్నారు. పోలీసులు, ఫిర్యాదుదారుకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలన్నారు.