మేడారం పనులనాణ్యతలో రాజీపడొద్దు : సీఎం రేవంత్‌‌‌‌

మేడారం పనులనాణ్యతలో రాజీపడొద్దు : సీఎం రేవంత్‌‌‌‌
  •     నిర్దేశిత స‌‌‌‌మ‌‌‌‌యంలో పూర్తిచేయాలి: సీఎం రేవంత్‌‌‌‌

హైద‌‌‌‌రాబాద్‌‌‌‌, వెలుగు: మేడారం అభివృద్ధి ప‌‌‌‌నుల నాణ్యతలో రాజీపడొద్దని అధికారులను సీఎం రేవంత్‌‌‌‌ రెడ్డి ఆదేశించారు. పనుల్లో ఏ మాత్రం పొర‌‌‌‌పాట్లు దొర్లినా క‌‌‌‌ఠిన చ‌‌‌‌ర్యలు తప్పవని హెచ్చరించారు. సోమవారం జూబ్లీ హిల్స్‌‌‌‌లోని తన నివాసంలో మేడారం అభివృద్ధి ప‌‌‌‌నుల‌‌‌‌పై సీఎం రేవంత్ రెడ్డి  స‌‌‌‌మీక్ష నిర్వహిం చారు.  నిర్మాణపనులపై అధికారులు పవర్‌‌‌‌పాయింట్‌‌‌‌ ప్రజెంటేషన్‌‌‌‌ ఇచ్చారు. 

రాతి ప‌‌‌‌నుల‌‌‌‌తో పాటు ర‌‌‌‌హ‌‌‌‌దారులు, విద్యుత్ స్తంభాల ఏర్పా టు, గ‌‌‌‌ద్దెల చుట్టూ భ‌‌‌‌క్తుల రాక‌‌‌‌పోక‌‌‌‌ల‌‌‌‌కు సంబం ధించిన మార్గాలు, భ‌‌‌‌క్తులు వేచి చూసే ప్రదేశాలు.. ఇలా ప్రతి ఒక్క అంశంపైనా  అధికారుల‌‌‌‌ కు సీఎం సూచ‌‌‌‌న‌‌‌‌లు చేశారు. అన్ని శాఖల స‌‌‌‌మ‌‌‌‌న్వయంతో పనులు సాగాలని అన్నారు. 

సంస్కృతీ, సంప్రదాయాలకు పెద్దపీట వేయాలి

మేడారం అభివృద్ధి ప‌‌‌‌నుల్లో ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాల‌‌‌‌కు పెద్ద పీట వేయాల‌‌‌‌ని అధికారులకు సీఎం  సూచించారు. నిర్మాణంలో చిన్న విమర్శలకు కూడా తావు ఇవ్వొద్దన్నారు. గద్దెల వద్ద 4 వైపులా ఫ్లడ్‌‌‌‌ లైట్లు ఏర్పాటు చేయాలన్నారు. 

గుడి చుట్టూ పచ్చదనం కన్పించేలా అభివృద్ధి చేయాలని సూచించారు. నిర్దేశిత స‌‌‌‌మ‌‌‌‌యంలోనే అభివృద్ధి ప‌‌‌‌నులు పూర్తి కావాల‌‌‌‌ని ఆదేశించారు. ఈ రివ్యూలో మంత్రులు కొండా సురేఖ‌‌‌‌,  పొంగులేటి శ్రీ‌‌‌‌నివాస్‌‌‌‌రెడ్డి,  అడ్లూరి ల‌‌‌‌క్ష్మణ్ కుమార్‌‌‌‌, సీఎం స‌‌‌‌ల‌‌‌‌హాదారు వేం న‌‌‌‌రేంద‌‌‌‌ర్ రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.