సీఎం రేవంత్ బర్త్ డే స్పెషల్: సన్న బియ్యంతో సీఎం చిత్రపటం

సీఎం రేవంత్ బర్త్ డే స్పెషల్: సన్న బియ్యంతో సీఎం చిత్రపటం

హైదరాబాద్ , వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి 57వ పుట్టినరోజు(ఈ నెల 8న) సందర్భంగా రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ 57 కిలోల సన్న బియ్యంతో ఆయన చిత్రపటాన్ని రూపొందించారు. ఆదివారం దీనిని సీఎంకు  బర్త్​డే గిఫ్ట్​గా అందజేయనున్నారు. ఇందుకు సంబంధించిన స్పెషల్ పోర్ట్రెయిట్‌ను మెట్టు సాయికుమార్ శుక్రవారం మీడియా ముందు విడుదల చేశారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ.."సన్న బియ్యం పథకం పేదలకు రేవంత్ ఇచ్చిన అమూల్యమైన బహుమతి. ఈ బియ్యం తెలంగాణ ప్రజలకు చిరకాలం గుర్తుండేలా.. నేను సన్న బియ్యంతో రేవంత్ చిత్ర పటాన్ని తయారు చేసి సీఎంకు శుభాకాంక్షలు చెప్తాను. ఆయనపై నాకున్న అభిమానాన్ని చాటుకుంటాను" అని మెట్టు సాయి  పేర్కొన్నారు.