పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు..రూ.25 లక్షలు చెక్కులు అందజేసిన సీఎం

పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు..రూ.25 లక్షలు చెక్కులు అందజేసిన సీఎం

హైదరాబాద్, వెలుగు : పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు సీఎం రేవంత్‌‌ రెడ్డి నగదు పురస్కారం అందజేశారు. బుధవారం సెక్రటేరియేట్‌‌లో సీఎం రేవంత్ రెడ్డిని పద్మశ్రీ అవార్డు గ్రహీతలు గడ్డం సమ్మయ్య , దాసరి కొండప్ప, వేలు ఆనందచారి, కూరేళ్ల విఠలాచార్య, కేతావత్ సోంలాల్ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఒక్కొక్కరికి రూ.25 లక్షల చొప్పున చెక్కులను అందించి, సత్కరించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌‌ రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.