న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు: సీఎం రేవంత్

న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు: సీఎం రేవంత్
  •     బార్ అసోసియేషన్ ప్రతినిధులకు సీఎం రేవంత్ హామీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని అడ్వకేట్ల ఆరోగ్య బీమాకు త్వరలోనే రూ.100 కోట్లు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం బార్ అసోసియేషన్ ప్రతినిధులు సీఎంను కలిశారు. ఆరోగ్య బీమా పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని సీఎంకు విజ్ఞప్తి చేశారు. అడ్వకేట్ల సంక్షేమానికి తగిన సహకారం అందించాలని కోరారు. గతంతో పోలిస్తే తమ సంఖ్య పెరిగిందని, అందుకు తగ్గట్టుగా న్యాయవాదుల సంక్షేమ సంఘానికి తగినంత ఆర్థిక సాయం అందించాలని విన్నవించారు.  కాగా, అడ్వకేట్ల  సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం అన్నారు.