హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌‌ రెడ్డి

హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్‌‌ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: మూడు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా పార్టీ చీఫ్ ఖర్గే నేతృత్వంలో జరిగిన సీడబ్ల్యూసీ సమావేశాల్లో రేవంత్‌‌ పాల్గొన్నారు. పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీతో కలిసి రాష్ట్రంలోని తాజా అంశాలు, కేబినేట్ విస్తరణ, నామినేటెడ్ పొస్టుల అంశాలపైనా చర్చించారు. 

కాగా, శనివారం సీడబ్ల్యూసీ, ఇతర నేతలతో బిజీగా గడిపిన సీఎం.. ఆదివారం కుటుంబసభ్యులతో టైమ్‌‌ స్పెండ్ చేశారు. అలాగే పార్టీ ఎంపీలతో పలు సమావేశాలు నిర్వహించారు. ఆదివారం రాత్రి హైదరాబాద్ తిరిగి పయనమయ్యారు.