టీజీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

టీజీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

టీజీ టెట్ 2024 ఫలితాలు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. టీజీ టెట్-2024కు ధరఖాస్తు 2 లక్షల 86  వేల 381 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్-1 పరీక్షకు 85 వేల 996 అభ్యర్థులు హాజరుకాగా  57 వేల 725 అర్హత సాధించారు. పేపర్-2 పరీక్షకు 1లక్షా 50 వేల 491 మంది అభ్యర్థులు హాజరుకాగా 51 వేల 443 మంది అర్హత సాధించారు.  పేపర్-1లో 67.13% పేపర్-2లో 34.18% అర్హత సాధించారు. 

2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% పెరిగిన అర్హత శాతం. 2023తో పోలిస్తే పేపర్-2లో 18.88% పెరిగిన అర్హత శాతం.  టెట్-2024లో అర్హత సాధించని దరఖాస్తుదారులకు వచ్చే టెట్ కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటు కల్పించింది ప్రభుత్వం. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది రేవంత్ సర్కార్.