తెలంగాణ చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ సమీక్ష

తెలంగాణ చిహ్నం తుది రూపుపై సీఎం రేవంత్ సమీక్ష

రాష్ట్ర చిహ్నం తుది రూపుపై సమీక్ష చేశారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో కళాకారుడు రుద్ర రాజేశం, మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్,జేఏసీ నేత రఘు, వేం నరేందర్ రెడ్డి, కొందరు ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు సీఎం. 

తెలంగాణ పోరాటం, అమరుల త్యాగాలు ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నాన్ని తయారీ చేస్తున్నారు. మరోవైపు పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు సీఎం రేవంత్ . ఆవిర్భావ వేడుకల్లోనే తెలంగాణ గీతం, లోగోను ఆవిష్కరించనున్నారు.