
అచ్చంపేట నియోజకవర్గాన్ని మోడల్ గా తీర్చిదిద్దుతానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నియోజకవర్గంలో ప్రతి రైతుకు సోలార్ పంపు సెట్లు పంపిణీ చేస్తామని చెప్పారు.100 రోజుల్లో అచ్చంపేటలో సోలార్ పంపు సెట్లు ఇస్తామన్నారు. సోలార్ పంపు సెట్లలో దేశానికే అచ్చంపేటను ఆదర్శంగా మార్చుతానని చెప్పారు రేవంత్.
నాగర్ కర్నూలు జిల్లా మాచారంలో ఇందిరా సౌర గిరి జల వికాసం పథకం ప్రారంభించిన రేవంత్ లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్. వ్యవసాయం కోసమే సౌర విద్యుత్ ఏర్పాటుచేశామన్నారు రేవంత్ రెడ్డి. అదనంగా వచ్చే సౌర విద్యుత్ ను ప్రభుత్వానికి ఇవ్వాలని సూచించారు. సౌర విద్యుత్ వినియోగంపై రైతులకు అవగాహన ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సౌర విద్యుత్ తో మీకు మంచి ఆదాయం వస్తుందన్నారు రేవంత్.
నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో సౌర విద్యుత్ ద్వారా నీరందించే ఇందిర సౌర గిరి జల వికాసం పథకాన్ని రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనరసింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండా సురేఖ, ఎంపీ మల్లు రవితో పాటు ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Also Read : సౌర గిరి జల వికాసానికి శ్రీకారం
ఆదివాసీ, చెంచు, గిరిజనుల సాగుభూమికి సాగునీటి వసతి కల్పించి అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.12,600 కోట్లతో ఐదేండ్ల పాటు ఈ పథకాన్ని అమలు చేయనుంది ఐదేండ్లలో రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల ఎకరాలను అభివృద్ధి చేయడం ద్వారా 2.10 లక్షల గిరిజన ఫ్యామిలీలకు లబ్ది చేకూరనుంది. మాచారం గ్రామంలో ఎంపిక చేసిన 26 మంది చెంచుల భూముల్లో బోర్లు తవ్వించి, సోలార్ ప్యానెల్స్, మోటార్లు, పైప్లైన్లు ఏర్పాటు చేశారు. ఉద్యానవన శాఖ అధికారులు పండ్ల మొక్కలు నాటారు. తోటల మధ్యలో అంతర్గతంగా ఆరుతడి పంటలు సాగుకు అనువుగా పైప్లైన్లు ఏర్పాటు చేశారు.
.