హైదరాబాద్ ను సిగ్నల్ ఫ్రీగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర్ అభివృద్ధిపై మండలిలో మాట్లాడిన రేవంత్ మూసీ సుందరీకరణతో పాటు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామన్నారు . మానవ తప్పిదాలతో మూసీ కాలుష్యమవుతుందన్నారు. ఓల్డ్ సిటీగా చెప్పేదే అసలైన నగరమన్నారు. చారిత్రక నగరంలో మానవ తప్పిదాలతో ఇబ్బందులు తలెత్తాయన్నారు. మూసీ ప్రక్షాళనకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు రేవంత్. మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్న పబ్లిక్ ఇబ్బంది పడుతున్నారని చెప్పారు.
సిటీలో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావాలన్నారు రేవంత్. మెట్రో నగరాల్లో పొల్యూషన్ ,ట్రాఫిక్ తీవ్ర సమస్యలు ఉన్నాయన్నారు. కనీసం పార్కింగ్ సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్నారని తెలిపారు. దివంగత జైపాల్ రెడ్డి కృషితోనే మెట్రో రైలు వచ్చిందన్నారు. దేశంలో ఐదు నగరాలు అత్యంత కీలకమన్నారు రేవంత్. పొల్యూషన్ తో ఢిల్లీలో స్కూళ్లు,ఆఫీసులకు సెలవులు ఇస్తున్నారని చెప్పారు. వర్షం పడిందంటే ముంబైలో కదల్లేని పరిస్థితి ఉందన్నారు. అందుకే క్యూర్,ఫ్యూర్,రేర్ గా సిటీని విభజించామని చెప్పారు రేవంత్. కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలను సిటీ బయటకు తరలిస్తామన్నారు.
మెట్రో విస్తరణకు నిర్ణయం తీసుకున్నామన్నారు రేవంత్. ఈ వ్యాపారంలో ఉండడం లేదని మెట్రో నుంచి ఎల్ అండ్ టీ తప్పుకుందన్నారు. మెట్రోను స్వాధీనం చేసుకుని 75 కి.మీ వరకు విస్తరిస్తామన్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో కనెక్టివిటీ ఉంటుందన్నారు. ఈ నెలాఖరు వరకు మెట్రోను స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.
►ALSO READ | బియ్యం ఎగుమతులపై మంత్రి ఉత్తమ్ Vs హరీశ్ రావు
రోడ్ల విస్తరణ కోసం డిఫెన్స్ భూములపై కేంద్రంతో చర్చించామన్నారు రేవంత్. బేగంపేట్ ఎయిర్ పోర్టో మద్యలో నుంచి అండర్ పాస్ కు అనుమతి తీసుకున్నామని చెప్పారు. పదేళ్ల నిర్లక్ష్యంతో మెట్రో దేశంలో 12 వ స్థానానికి పడిపోయిందన్నారు. రోడ్లను మూడు రకాలుగా విభజించామని తెలిపారు. రోడ్లు, అండర్ పాస్ లు, కారిడార్లు నిర్మించాలని ప్లాన్ వేశామని చెప్పారు. సిటీలో సిగ్నల్ ఫ్రీ చేయాలనేదే ఉద్దేశమన్నారు. సిటీలో ఫుట్ పాత్ లపై ఆక్రమణలను తొలగిస్తామని చెప్పారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులున్నా ఆక్రమణలు తొలగిస్తామన్నారు. చిరు వ్యాపారులకు ప్రత్యేక ప్రాంతాల్లో ఏర్పాటు చేశామన్నారు. జూన్, జులై వరకు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని చెప్పారు. కేబీఆర్ దగ్గర మల్టీ లెవర్ పార్కింగ్ ఏర్పాటు చేశామని తెలిపారు. హిల్ట్ పాలసీతో కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు రేవంత్. హిమాయత్ నగర్ నుంచ గౌరవెల్లి వరకు ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తామన్నారు రేవంత్.
