కాశీబుగ్గ, వెలుగు: రాష్ర్ట ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అర్హులైన వారికి అందేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం హైదాబాద్‌లో గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కొత్తగా ఎన్నికైన జిల్లా అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ర్ట ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, విశ్వనాధన్సచిన్ సావంత్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, జిల్లా మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు దొంతి మాధవ రెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి, కేఆర్ నాగరాజు, యశస్విని రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, గ్రేటర్ మేయర్ సుధారాణితో పాటు వరంగల్, హనుమకొండ జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ ఆయూబ్, వెంకట్రామ్రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ప్రతి కార్యకర్తను కలుపుకొని పని చేయాలన్నారు. అనంతరం వరంగల్, హనుమకొండ జిల్లాల డీసీసీ అధ్యక్షులు నియామక పత్రాలను అందుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, జనగాం డీసీసీ అధ్యక్షులు లకావత్ ధనవంతి, మహబూబాబాద్ డీసీసీ అధ్యక్షులు భూక్య ఉమ, పీసీసీ ప్రధాన కార్యదర్శి కత్తి వెంకటస్వామి ఉన్నారు.
