కమ్యూనిస్టులంటేనే ప్రతిపక్షం.. ఏ ప్రభుత్వం దిగిపోయినా వారి వల్లే

కమ్యూనిస్టులంటేనే ప్రతిపక్షం.. ఏ ప్రభుత్వం దిగిపోయినా వారి వల్లే

కేంద్రంలో ఏ  ప్రభుత్వం దిగిపోయినా కమ్యూనిస్టులే కారణమని తన నమ్మకం అన్నారు . రవీంధ్ర భారతిలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభకు హాజరయ్యారు రేవంత్.  సురవరం చిత్రపటానికి నివాళి అర్పించారు.  ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్  ..కమ్యునిస్టులంటేనే ప్రతిపక్షమని అన్నారు.   కమ్యూనిస్టు సిద్ధాంతం,ఆలోచన ఇంకా పెరగాలన్నారు రేవంత్.  కమ్యునిజం అంటే లైబ్రరీలో దొరికే పుస్తకం కాదని..  కమ్యూనిస్టులంటేనే ప్రజల కోసం కొట్లాడే వాళ్లని అన్నారు. 
కమ్యూనిస్టులంటే ప్రజలకు ఓ భరోసా,నమ్మకం ఉందన్నారు.  సురవరం ఉంటే ఓట్ చోరీపై మరింతగా పోరాడే వారరన్నారు రేవంత్

మహారాష్ట్రలో నాలుగు నెలల్లో కొత్తగా కోటి మంది ఓటర్లు పుట్టుకొచ్చారని ఆరోపించారు సీఎం రేవంత్. బీహార్ లో 65 లక్షల కొత్త ఓట్లు వచ్చాయని చెప్పారు.  ఓట్ల తొలగింపుతో  ఈ సమస్యకు పరిష్కారం దొరకదన్నారు.  సురవరం ప్రజలక కోసం నిరంతరం పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. సురవరం ఆనాడు గోల్కోండ  పత్రికను నడిపారని చెప్పారు.  

సురవరం చివరి శ్వాస వరకు సీపీఐతోనే ఉన్నారని.. 65 సంవత్సరాల పాటు ఎర్రజెండా నీడనే ఉన్నారని కొనియాడారు రేవంత్.   సురవరం సామాజిక చైతన్యం ఉన్నవారన్న  రేవంత్..  రెండో తరంలో జైపాల్ రెడ్డి, సురవరం మహబూబ్ నగర్ కు  వన్నె తెచ్చారని తెలిపారు.  సురవరంను ఎప్పటికీ  గుర్తుంచుకునేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు రేవంత్.  సురవరం సుధాకర్ రెడ్డి సూచనతోనే  తెలుగు యూనివర్శిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టామన్నారు రేేవంత్.