తెలంగాణ రైజింగ్ 2047 పై స్పోర్ట్స్ చాప్టర్ పెడతాం: సీఎం రేవంత్

తెలంగాణ రైజింగ్ 2047 పై స్పోర్ట్స్ చాప్టర్ పెడతాం: సీఎం రేవంత్

శనివారం ( ఆగస్టు 2 ) హైదరాబాద్ లోని HICC లో ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ తెలంగాణ స్పోర్ట్స్ కాంక్లేవ్ సభలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్. డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నామని.. యువతకు దశ దిశా లేకపోవడం బాధాకరమని అన్నారు. వ్యసనాల రూపంలో మనవైపు వేగంగా ప్రమాదం దూసుకొస్తుందని అన్నారు. ఓ విధానం లేకపోవడం వల్లే సమస్యలు వస్తున్నాయని.. అందుకే నూతన క్రీడావిధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు. క్రీడల్లో రాజకీయ జోక్యం ఉండకూడదని భావిస్తున్నామని అన్నారు సీఎం రేవంత్.తెలంగాణ రైజింగ్ 2047 పై స్పోర్ట్స్ చాప్టర్ పెడతామని అన్నారు సీఎం రేవంత్

1956లో ఫుట్ బాల్ టీంలో మనవాళ్ళు 9 మంది ఉండేవారని.. క్రీడల్లో హైదరాబాద్ కు మంచి పేరు ఉండేదని అన్నారు. జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో రాణించినవారిని ప్రోత్సహిస్తున్నామని అన్నారు. చదువుల్లోనే కాదు, క్రీడల్లోనూ రాణిస్తే ఉద్యోగం ఇస్తామని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో క్రీడా నైపుణ్యానికి కొదవ లేదని అన్నారు. ఇప్పుడు స్టేడియంలు ఫంక్షన్ హాల్స్ గా మారాయని అన్నారు. ఒలంపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా రాకపోవడం సిగ్గు అనిపిస్తోందని అన్నారు.మనకంటే చాలా చిన్న దేశాలు క్రీడల్లో రాణిస్తున్నాయని అన్నారు.

ఇటీవల సౌత్ కొరియాను సందర్సించామని.. అక్కడ స్పోర్ట్స్ వర్సిటీలో చదివినోళ్లే గోల్డ్ మెడల్స్ కొట్టారని అన్నారు.చైతన్యానికి పోరాటానికి మారుపేరైన తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో నిలబడి పోరాటం చేసిన యువత నేడు దశ దిశా లేకుండా.. ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణిస్తున్నారని అన్నారు. 

పోరాట స్ఫూర్తి, చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడల్లో రాణించాలని, దేశానికి గొప్ప పేరు తేవాలనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రానికి క్రీడావిధానం ఉండాలని, క్రీడా విధానంలో రాజకీయ జోక్యం తగ్గించాలని, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్ షిప్ తో నూతన క్రీడా విధానాన్ని తీసుకొస్తున్నామని అన్నారు.