
ఖమ్మం టౌన్, వెలుగు : ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డి ద్వారా హైదరాబాద్ లో జీపీఓలకు అందించే నియామక ఉత్తర్వు అందజేస్తామని, ఈ కర్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపై రెవెన్యూ సీసీఎల్ఏ కార్యదర్శి లోకేశ్ కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ లో ఖమ్మం అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి తో కలిసి కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి పాల్గొన్నారు. సీసీఎల్ఏ మాట్లాడిన తర్వాత కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కార్యక్రమ ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు.
భూ భారతి చట్టం అమలులో భాగంగా జీపీఓల నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేస్తారని తెలిపారు. ఖమ్మం జిల్లాలో 307మంది నియామక పత్రాలు అందుకుంటారన్నారు. హైదరాబాద్ లో అభ్యర్థులు హాజరయ్యేందుకుఏర్పాట్లు సజావుగా చేయాలని చెప్పారు. గ్రామ పాలానాధికారులకు వారి సొంత మండలంలో కాకుండా ఇతర మండలాలలో నియమించేందుకు గురువారం జిల్లా కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ద్వారా ఎంపికైన క్లస్టర్లకు ఉత్తర్వులు ఇస్తామని వెల్లడించారు. ఈ సమీక్ష లో డీఆర్ఓ ఏ. పద్మశ్రీ, కలెక్టరేట్ ఏవో కె. శ్రీనివాస్ రావు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.