ఫిబ్రవరి 3 నుంచి ..9 జిల్లాల్లో సీఎం బహిరంగ సభలు

ఫిబ్రవరి 3 నుంచి ..9 జిల్లాల్లో  సీఎం బహిరంగ సభలు

తెలంగాణలో ఎన్నికల మున్సిపల్ ఎన్నికల హీట్ మొదలైంది.అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం అయ్యింది. జిల్లాల్లో సీఎం బహిరంగ సభలకు ప్లాన్ చేస్తోంది. ఉపాధి హామీ పథకంలో గాంధీ పేరుతొలగింపు ఓ వైపు నిరసన కార్యక్రమాలు..మరోవైపు ఎన్నికల వ్యూహాలతో ముందుకెళ్తోంది కాంగ్రెస్. ఈ క్రమంలోనే ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో సీఎం బహిరంగ సభలకు కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 3న మహబూబ్ నగర్ జిల్లాలో బహిరంగ సభ జరగనుంది. ఇలా ఫిబ్రవరి 9 వరకు ఉమ్మడి జిల్లాల్లో బహిరంగ సభలు జరగనున్నాయి. 

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిక బహిరంగ సభల సమన్వయ బాధ్యత అప్పగించింది కాంగ్రెస్. మీనాక్షి, పీసీసీ చీఫ్ డిప్యూటీ సీఎంలకు పర్యవేక్షణ బాధ్యత అప్పగించారు. ములుగు బహిరంగ సభకు సోనియా, రాహుల్ కు ఇన్విటేషన్ ఇవ్వనున్నారు. అలాగే మండలాల్లో నిరసన సభలను విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఒక్కో మండలానికి ఒక్క కీలక లీడర్ బాధ్యత తీసుకోవాలని సూచించారు సీఎం.

ALSO READ : మున్సిపల్ ఎన్నికలకు SEC రెడీ..

ఈ సారి మున్సిపల్ ఎన్నికలను  బ్యాలెట్ పేపర్ తోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికలు జరిగే117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో బ్యాలెట్ బాక్స్​లు సిద్ధం చేసుకోవాలని జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లను ఆదేశించింది.రాష్ట్రవ్యాప్తంగా 124 మున్సిపాలిటీలు 9 గ్రేటర్ కార్పొరేషన్లు ఉండగా వీటిలో గ్రేటర్ హైదరాబాద్​(జీహెచ్ఎంసీ) పాలకవర్గం గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు సిద్దిపేట, జడ్చర్ల, కొత్తూర్, అచ్చంపేట, నకిరేకల్ మున్సిపాలిటీల పాలవర్గాల గడువు వచ్చే ఏడాది మే వరకు ఉన్నది. ఇవి కాక మందమర్రి, మణుగూరు మున్సిపాలిటీలు షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నవి.

ALSO READ : అలర్ట్.. HT పత్తి విత్తనాలు అమ్మొద్దు..కొనొద్దు

ఈ పది చోట్ల మినహా ఇంకా మిగిలిన 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు ఈ ఏడాది జనవరిలోనే ముగిసింది. ప్రస్తుతం ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతున్నది. ఇప్పటికే 117 మున్సిపాలిటీల పరిధిలో 2,630, ఆరు కార్పొరేషన్ల పరిధిలో 366 వార్డులను ఎలక్షన్ కమిషన్ ఫైనల్ చేసింది. అన్ని చోట్ల కలిపి 52.71 లక్షల మంది ఓటర్లు ఉన్నట్లుగా ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించి, అభ్యంతరాలను స్వీకరిస్తున్నారు.