నేడు (డిసెంబర్ 4) ఆదిలాబాద్‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి..రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

నేడు (డిసెంబర్ 4) ఆదిలాబాద్‌‌‌‌కు సీఎం రేవంత్ రెడ్డి..రూ. 500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  • ఏర్పాట్లు పూర్తి చేసిన ఆఫీసర్లు

ఆదిలాబాద్, వెలుగు : సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి గురువారం ఆదిలాబాద్‌‌‌‌ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 500 కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభకు హాజరవుతారు. సీఎం పర్యటన, సభ కోసం ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. 

ప్రభుత్వ సలహాదారుడు సుదర్శన్‌‌‌‌రెడ్డి బుధవారం ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో జరుగుతున్న సభ ఏర్పాట్లను పరిశీలించారు. సీఎం పర్యటన, సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కాగా, ఆదిలాబాద్‌‌‌‌కు మంజూరైన ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ నిర్మాణంపై సీఎం ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న ఎయిర్‌‌‌‌పోర్ట్‌‌‌‌ మైదానాన్ని సీఎం పరిశీలించనున్నట్లు సమాచారం. సీఎం పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 700 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అఖిల్‌‌‌‌ మహాజన్‌‌‌‌ చెప్పారు.