V6 News

83 పేజీలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్- 2047.. క్యూర్, ఫ్యూర్,రేర్ జోన్లుగా తెలంగాణ

83 పేజీలతో తెలంగాణ విజన్ డాక్యుమెంట్- 2047.. క్యూర్, ఫ్యూర్,రేర్ జోన్లుగా తెలంగాణ

తెలంగాణ విజన్ 2047 డాక్యముంట్ ను రిలీజ్  చేశారు సీఎం రేవంత్ రెడ్డి. గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ను   రిలీజ్ చేసిన రేవంత్.. ఇది నాలుగు గోడల మధ్య తయారు చేసిన విజన్ డాక్యుమెంట్ కాదని.. 4 లక్షల మంది ప్రజలు ఆన్ లైన్ లో   సూచనలు ఇచ్చారని చెప్పారు. స్వేచ్ఛ, సమాన అవకాశాలు ఇవ్వాలనే ఈ విజన్ తీసుకొస్తున్నామని తెలిపారు.  నీతి అయోగ్,ఐఎస్ బీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజలు ఈ విజన్ లో భాగమయ్యారని చెప్పారు. 

2047 నాటికి స్వాతంత్ర్యం వచ్చి వందేళ్లు పూర్తవుతుందన్నారు. 2047 వరకు దేశం 30 ట్రిలియన్ ఎకానమి లక్ష్యంగా ముందుకెళ్తుందని..తెలంగాణ  3 ట్రిలియన్ డాలర్ల  ఎకానమీ లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు రేవంత్. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు  అత్యంత ప్రాధాన్యం ఇస్తామన్న రేవంత్.. వీటితో పాటు కమ్యూనికేషన్ కు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నామన్నారు.

వందేండ్ల స్వాతంత్ర్య భారత్ లో తెలంగాణ పాత్ర పెద్దగా ఉండాలన్నారు రేవంత్.   తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉందన్న రేవంత్.  అతిపెద్ద రైతాంగ సాయుధ పోరాటం ఇక్కడే జరిగిందన్నారు. ఈ పాలసీ ఫార్మర్, యూత్, ఉమెన్ అభివృద్ధే లక్ష్యంగా ఉంటుందన్నారు.  తాను మారుమూల గ్రామం నుంచి వచ్చానని చెప్పారు. ఎస్టీ,ఎస్టీ,బీసీ,మైనార్టీల సమస్యలు తనకు తెలుసన్నారు రేవంత్. చైనా ,జపాన్,కొరియా,సింగపూర్ తమ రోల్ మోడల్స్ అని తెలిపారు.

తెలంగాణ విజన్ డాక్యుమెంట్- 2047ముఖ్యాంశాలు

  • 83 పేజీలతో డాక్యుమంట్ రూపకల్పన 
  • 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన
  • విజన్ డాక్యుమెంట్ లో క్యూర్, ఫ్యూర్,రేర్ జోన్లుగా తెలంగాణ
  •  తెలుగు,హిందీ,ఇంగ్లీష్ భాషలో  విజన్ డాక్యుమెంట్
  • తెలంగాణ మీన్స్ బిజినెస్ పేరుతో డాక్యుమెంట్
  • స్వేచ్ఛ, సమానత్వం అవకాశాల కోసమే విజన్ డాక్యుమెంట్
  • యువత, మహిళలు, రైతులకు ప్రాధాన్యం
  • తాత్కాలిక విధానం నుంచి స్థిరమైన విధానం
  • పరిపాలనలో ప్రతిభ ,నాలెడ్జ్ హబ్
  • సమ్మిళిత, సుస్థిర సంక్షేమానికి ప్రాధాన్యం
  • అభివృద్దికి వనరులు, పర్యావరణం,సుస్థిరతపై  దృష్టి
  • సమతుల్య అభివృద్ధికి క్యూర్‌, ప్యూర్‌, రేర్‌ విధానం
  • పెట్టుబడుల ఆకర్షణ, పాలనలో పారదర్శకత
  • విధానపరమైన నిర్ణయాలను ప్రోత్సహించాలని నిర్ణయం
  • గేమ్‌ ఛేంజర్‌ ప్రాజెక్ట్‌లకు అధిక ప్రాధాన్యం
  • ఫ్యూచర్‌ సిటీ, మూసీ పునరుజ్జీవం, డ్రై పోర్ట్‌..
  • గ్రీన్‌ఫీల్డ్‌ హైవే, RRR, రింగురైలు, బుల్లెట్ రైలు
  • ప్రపంచ పెట్టుబడుల ఆకర్షణ, ప్రత్యేక నిధి ఏర్పాటు
  • వాతావరణ మార్పుల వల్ల నష్టాలను తగ్గించడం
  • పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతపై దృష్టి
  • సాంస్కృతిక వారసత్వం, కళలు, పర్యాటకం పరిరక్షణ
  • పాలనలో పౌరుల భాగస్వామ్యం నిర్ధారించడం