- రేపు సీడబ్ల్యూసీ మీటింగ్‌కు హాజరు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం10 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్ర రాజకీయాలు, పార్టీపరమైన కీలక అంశాల నేపథ్యంలో ఆయన ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్న సీఎం.. సోమవారం ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. మంగళవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశానికి హాజరుకానున్నారు.
