గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

గోల్కొండ కోటపై జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చారిత్రక గోల్కొండ కోటలో వేడుకలు నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గోల్కొండ కోటలో జాతీయ జెండా ఆవిష్కరించారు. కార్యక్రమానికి సీఎస్, మంత్రులు, ముఖ్య నేతలు అటెండ్ అయ్యారు. అంతకుముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సైనిక అమరవీరుల స్థూపం దగ్గర అంజలి ఘటించారు సీఎం రేవంత్ రెడ్డి.  పరేడ్ గ్రౌండ్స్ లో సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. ఇక అక్కడి నుంచి నేరుగా గోల్కొండ కోటకు చేరుకున్నారు.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో  ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు.  గోల్కొండ పరిసరాల్లో ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. రాణిమహల్ లాన్స్ నుంచి గోల్కొండ కోట వరకూ ఉన్న రోడ్డు మూసివేశారు. సికింద్రాబాద్, బంజారాహిల్స్, మాసబ్యాంక్, మెహిదీపట్నం వైపు నుంచి గోల్డ్, A పింక్, A నీలం పాసులు ఉన్న వారిని గోల్కొండ కోట వరకు అనుమతి ఉంటుంది. A  గోల్డ్ పాసులున్న వారు వాహనాలను పోర్టు మెయిన్ గేట్ ఎదురుగా ఉన్న ప్రధాన రహదారిపై ఫతేదర్వాజా రోడ్డు వైపు పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.