ఇయ్యాల (మే 02న) ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

ఇయ్యాల (మే 02న) ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
  • సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరు

హైదరాబాద్, వెలుగు: జన గణనతో పాటు కుల గణన చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడంతో దీనిపై చర్చించేందుకు శుక్రవారం సాయంత్రం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. కాంగ్రెస్ పాలిత సీఎంలు ఈ మీటింగ్​కు రావాలని హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.

 ఈ నేపథ్యంలో శుక్రవారం ఉదయం ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. సీడబ్ల్యూసీ మీటింగ్ అనంతరం కాంగ్రెస్ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ తో రేవంత్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.