18న రాష్ట్ర కురుమ సంఘం భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి

18న రాష్ట్ర కురుమ సంఘం భవనాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్​రెడ్డి

ఖైరతాబాద్​,వెలుగు : తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమరయ్య పేరిట కోకాపేటలో నిర్మించిన రాష్ట్ర కురుమ సంఘం భవనాన్ని ఈనెల18న సీఎం రేవంత్​రెడ్డి ప్రారంభించనున్నట్లు కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తెలిపారు.  శనివారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవ భవనం ప్రారంభానికి కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య

 హర్యానా గవర్నర్​బండారు దత్తాత్రేయ, మంత్రి పొన్నం ప్రభాకర్​ కూడా హాజరువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదవ్, సంఘం జనరల్​సెక్రటరీ బండారు నారాయణ, సెక్రటరీ కొలుకుల నర్సింహ, కోశాధికారి కట్టా మల్లేశం,యూత్​ అధ్యక్షుడు తూముకుంట అరుణ్​కుమార్, మహిళా ప్రతినిధులు బాలమణి, విజయలత, సునీత, విజయ, శారద పాల్గొన్నారు.