తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గవర్నర్ శుక్లా
  • గవర్నర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: తిరుమలలో శ్రీవారిని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా బుధవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న గవర్నర్‌‌‌‌‌‌కు అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన సతీమణి జానకి శుక్లాతో కలిసి ముందుగా ధ్వజస్తంభానికి మొక్కుకుని, తర్వాత గర్భగుడిలో మూలవిరాట్టును దర్శించుకున్నారు. రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనాలు అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం, క్యాలెండర్లు అందజేశారు.

దర్శనం అనంతరం టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గవర్నర్‌‌‌‌కు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం గవర్నర్ దంపతులు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ బర్త్​డేకు సీఎం విషెస్గవర్నర్ బర్త్​డే సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, దీర్ఘకాలం ప్రజాసేవ కొనసాగించాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి గవర్నర్ మద్దతు కీలకమని, ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ సాధనలో ఆయన మార్గదర్శకత్వం అవసరమని సీఎం పేర్కొన్నారు.