
కొడంగల్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత సెగ్మెంట్ కొడంగల్లో సోమవారం పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ టౌన్ లోని ఆయన ఇంటికి చేరుకుంటారని వ్యక్తిగత సిబ్బంది సమాచారం ఇచ్చారు. అనంతరం మండలాల వారీగా పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్ని స్వామి వారికి పట్టు వస్ర్తాలు సమర్పించనున్నారు.