- రెండో రోజు ఢిల్లీలోనే రేవంత్ రెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీలో ప్రతికూల వాతావరణం నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్ తిరుగు ప్రయాణం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. సోమవారం హైదరాబాద్‌లో దివంగత బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణలో రేవంత్‌రెడ్డి పాల్గొనాల్సి ఉంది. అయితే దట్టమైన పొగమంచు, క్లియర్ విజన్ లేకపోవడంతో ఢిల్లీ నుంచి పలు రాష్ట్రాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి.
ఎలాంటి అపాయింట్‌మెంట్లు, మీటింగ్‌లు లేకుండా ఢిల్లీలోని తన అధికారిక నివాసంలోనే కుటుంబ సభ్యులతో కలిసి రేవంత్ ఉండిపోయారు. మరోవైపు విమానాల రద్దు, పొగమంచు కారణంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ కూడా ఢిల్లీలోనే ఆగిపోవాల్సి వచ్చింది.
