కేసీఆర్ తెలంగాణ ట్రంప్.. ఓడించి పక్కన పెట్టినం : సీఎం రేవంత్ రెడ్డి

కేసీఆర్ తెలంగాణ ట్రంప్.. ఓడించి పక్కన పెట్టినం : సీఎం రేవంత్ రెడ్డి

మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం సమ్మిట్లో మాట్లాడిన  సీఎం రేవంత్.. తెతెలంగాణలో ఒక ట్రంప్ ఉండేవాడని...ప్రజలు ఆయనను పక్కన పెట్టేశారని అన్నారు. ఇష్టారాజ్యంగా పరిపాలన నడిపించే వాళ్ళు ఎవరైనా ట్రంప్ అవుతారని అన్నారు.  రాత్రి నిద్రలో ఏదైనా ఆలోచన వస్తే, మరుసటి రోజు ఆర్డర్ ఇవ్వడం చాలా రోజులు నడవదని అన్నారు. పరిపాలన చెయ్యాలంటే పొలిటికల్ విల్ చాలా అవసరమని అన్నారు. 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్   ట్రంప్ తీసుకునే  నిర్ణయాల వల్ల అమెరికాకే నష్టం జరుగుతుందని చెప్పారు రేవంత్.  ట్రంప్ రాత్రి అనుకున్నది తెల్లారి చేస్తున్నాడని అన్నారు.  మోదీ తన దోస్త్ అని ట్రంప్  అంటారు..ఇండియాపై 50 శాతం టారిఫ్ లు వేస్తారని చెప్పారు. ట్రంప్ లాంటి వాళ్ల ఆటలు ఎక్కువ రోజులు సాగవన్నారు.

 అమెరికా కాదంటున్న సంస్థలు ఇండియాకి రావాలని పిలుపునిచ్చారు రేవంత్. హార్వర్డ్,  స్టాన్ఫోర్డ్  సంస్థలతో మాట్లాడుతానని అన్నారు రేవంత్.. తెలంగాణలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తాం...  తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు రేవంత్. 

తెలంగాణలో ట్రిపుల్ ఆర్ నిర్మాణం కోసం కృషి చేస్తున్నామని తెలిపారు సీఎం రేవంత్. ఐటీ, ఫార్మా కంపెనీల కోసం రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు.  కోర్ సిటీలోని ఇండస్ట్రీస్ ఓఆర్ఆర్ బయటకు తరలిస్తామని చెప్పారు. సిటీ నుంచి రూరల్ ఏరియాలకు రోడ్ల డెవలప్ మెంట్ చేస్తామని.. గ్రామీణ ప్రాంతాలకు కూడా పరిశ్రమలను విస్తరిస్తున్నామని చెప్పారు.